క్లిక్ క్లిక్

blogger hit counter

కంపూటర్లు-చెత్తకుండీ-ఫ్రీ సాఫ్ట్వేర్లు

మనం వాడే కంప్యూటర్ లు సెల్ ఫోన్ వాటి పని అయిపోయాక ఎక్కడికి వెళ్తాయి అని సందేహం వచ్చిందా?అయితే ఇంకెందుకు  ఆలస్యం ఈ లింక్ ని క్లిక్ చేయండి
కంప్యూటర్ లు రిటైర్మెంట్ తీసుకున్నాక వెళ్ళేచోటు

కమర్షియల్ సాఫ్ట్వేర్లకి బదులుగా ఫ్రీ సాఫ్ట్వేర్ కావాలి అంటే ఈ సైట్ చూడక తప్పదు
ఆల్టర్నేటివ్ సాఫ్ట్వేర్

~~@@@@~~

"ఎవరీ బ్లాగరి..గూడచారి 116 ఊహాగానాలు"

ఎవరీ బ్లాగరి?
ఎక్కడా ఈయన పేరు లేదు?బ్లాగ్ పేరులో ఏదైనా క్లూస్ ఉన్నాయా అని వెతికి చూసా, కాని హుహు ..దొరికి చావదే?
పోస్టులు రాసినది సెరా అని మాత్రం కనిపిస్తోంది.
హలో ఎవరు మీరు?
ఏమో ఈ బ్లాగరి ఎవరో ఇతనికి తెలియదు.నిత్య ప్రయాణికుడు అని చెప్పుకొచ్చాడు...కళ్ళల్లో కలలు ఎన్నో..వాటిని సాకారం చేసుకునే దిశగా సాగుతున్న ఇతని పయనం లో ,బ్లాగ్ వనం ఓ తాత్కాలిక మజిలీ అని అన్నాడు.
పేరు అడిగితే..సెరా  అని చెప్పాడు..అంటే అని అడిగితే తన కలం లేదా బ్లాగు నామము అని జవాబు వచ్చినది.సెరా  అన్నది సిరా అనే పదంలోంచి వచ్చినదేమో అని నా ప్రగాఢ అభిప్రాయం.
ఈ బ్లాగరికి బ్లాగడం లో ఓ మోస్తారు అనుభవం ఉంది.ఆంగ్లములో లో మిత్రుల కోసం బ్లాగీ  బ్లాగీ ,తెలుగు లో కూడా బ్లాగుదామని మనసు పీకీ ..ఇటు వైపు రావడం జరిగింది.ఈ బ్లాగరి కంప్యూటర్ విషయ పరిజ్ఞానం ఓ మోస్తారు..1 /5 మార్కులు వేయొచ్చు.తనకు తెలిసిన అల్లా టప్పా సైట్స్ గురించి వాగాడం చూసి..మిత్రులు భరించలేక,బ్లాగర్ గా ప్రమోషన్ ఇచ్చేసి చేతులు దుల్పుకున్నారు.
కాలేజీ రోజుల్లో ఇతగాడు..తప్పు ఫీల్డ్ లోకి వచ్చాడు అని అనుకున్నారు...మైక్రోసాఫ్ట్ ,గూగుల్ వారిని ఓడించడం ఇష్టం లేక తనే తప్పుకున్నాడు అని కోతలు కూడా కోశాడని కాలేజీ రీకార్డుల్లో భద్రపరిచారు..
"ఇతనికి పొట్ట కోస్తే ప్రోగ్రామింగ్ ముక్క రాదు అని బ్లాగ్ మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను"
ఆ రోజుల్లో "అమ్మాయి అణుభాంబు" అన్న బ్రహ్మపధార్థము పై వీరి మిత్రులందరు శోధనాగ్రంథములు చదువుతుంటే ఈ మహాశయుడు "కంప్యూటర్ దాని మర్మములు" అనే గ్రంథాలని తినేసావాడని అక్కడే మగజైన్ దుకాణం లో ఎక్కువ సమయం గడిపేవాడు అని పాత హాజరు పట్టికలో చూడగా తెలిసింది
ఈయన గారికి ఏకలవ్య శిష్యులు ఉండేవారని..."కాలేజీ పిట్టకథలు" అనే మహా గ్రంథం లో 2012 పేజి లో సవివరంగా రాసి ఉంది.
ఈయనకో గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రాథమిక పరిశోధన లో తేలింది..తీర చూస్తే డెస్క్టాపు ని ఇతనో గర్ల్ ఫ్రెండ్ లాగా చూసుకునే వాడని అర్థం అయ్యింది..ఇప్పుడో మరొక కొత్త గర్ల్ ఫ్రెండ్ ని కూడా చూసుకుంటున్నాడు అని తెలియవచ్చింది.ఈ మధ్యే లాప్టాప్ కొన్నాడని చెత్త బుట్టిలో చింపేసిన రసీదు చెప్పిన కథ.మార్గదర్శిలో చేరి ఓ చిన్న లాప్-టాప్ కొన్నాడని మిత్రబృందం ఊహాగానాలు..

ఇతని ఇష్టా ఇష్టాలు
"అమ్మ ఆవకాయ అంజలి " అని అదేదో సినిమాలో చెప్పినట్టుగా సమాధానం వస్తుంది అని అనుకుంటున్నారా ..అయితే మీరు ఆవకాయ లో చెంచా వేసారు..అమ్మ ఇష్టమే...ఆవకాయ ఓకే ..అంజలి..ఇంతకి ఎవరు ఈవిడ? అని టైపు మన ఈ బ్లాగ్ మిత్రుడు.
తెలుగు సాహిత్యం ఇష్టం.ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టల్లో తెలుగు పుస్తకాలు ఎన్నో.ఈ బ్లాగరి విశాలాంధ్ర బుక్ స్టాల్లో సంచరిస్తాడని ఇప్పుడే మొన్న అందిన వార్త."తెలుగు పుస్తకం కొను-ఇంగ్లీష్ పుస్తకం అయితే అరువు తీసుకో" అన్న నానుడి ఈయనదే -అని మిత్రబృందం ఊవాచ.(చూడుము:కాలేజీ కథలు..అధ్యాయము 2012 :23 పుట)
తెలుగు జానపదాలు..ఆ పాత మధురాలు..కమ్మని కమనీయ హింది వివిధభారతి పాటలు...ఇంగ్లీష్ రాక్ సంగీత హోరు ....
తెలుగు కామెడీ సినిమాలు..రాజేంద్రుడువి(పాతవి అని మనవి చేసుకోమన్నాడు)..నవతరంగం లో సినిమా రివ్యూలు చదవడం ఈ మధ్యే అలవాటు చేసుకున్నాడు.అలాగే పంచావతరం అనే కామెడీ క్రిటిక్ సీరియల్ ని బాగానే ఆస్వాదిస్తారు అని మొన్న ఇతని ఇంట్లో పెట్టిన సీక్రెట్ కెమెరా కి క్లిప్పింగ్లు దొరికాయి.
ఈ జీవి విశాలాంధ్ర,ఆదివారం కోటి పాత పుస్తకాల షాపుల దగ్గర కనిపించనప్పుడు ఇరాని కేఫుల్లో ఇరాని చాయ్ తాగుతూ కనిపిస్తాడంట..
మరి నచ్చనివో
"నాకు తెలుగు లో నచ్చని ఒకే ఒక ..."అంటూ అనడం ఇప్పడివరకూ ఎప్పుడు అనలేదని సవినయంగా తెలియజేసుకుంటూ ..
విరామ సూచికను పెట్టేసి ....

"ఒక్కమొగాడు..ఒక్క టపా".ఫోటో కథా కమిషనూ!

నే: హాయ్ అనిల్
అనిల్: ఎలా ఉన్నావు?
నే: నేను ఓకే ..ఇంకేంటి ..ఏదో బ్లాగ్ పెడతా అన్నావుగా..ఎక్కడి వరకు వచ్చాయి  ప్రయత్నాలు ?
అ: ఏమి ప్రయత్నాలో ఏమో  ..ఆది లోనే హంసపాదు అన్నట్టు ...
నే: ఎవయింది?
అ: మొదటి టపా రాసేసి ఓ ఇమేజ్ పెట్టా అందులో ..మొదటి కొన్ని హిట్స్ వచ్చాయి..దానితో పాటే కాపీ-రైట్ హక్కులు ఉల్లంగించినట్టు ఓ ఈమెయిలు ..నేను పట్టించుకోలేదు ..వర్డుప్రెస్సు బ్లాగ్ వాళ్ళకి వెళ్లినట్టు ఉంది రిపోర్ట్ ..వాడే మూసేసి ...నాయన ఇక నువ్వు బ్లాగినది చాలు అన్నాడు..అంతే..నేను మళ్లీ ఇంకో టపా రాయలేదు.మొదటి టపా కే బ్లాగ్ టపా కట్టేసింది...
నే: ఇంతకి ఇమేజ్ ఎక్కడనించి "కట్టి..కాపీ కొట్టి ..పేస్టినావు"
అ: గూగలోడి ఇమేజ్ సర్వీస్ నుండి..
నే: ఇంతకి ఏ ఫోటో?
అ: ఒక్క మొగాడి ఫోటో
నే: ఏ ఒక్క మొగాడిది?
అ: అమెరికా ఒక్క మొగాడిది
నే: ఓహో అందుకే ...అయ్యింది.ద్రోహి మన ఒక మగాళ్ళను మరచి పరాయి ఒక్క మొగాళ్ళ చిత్రం పెట్టితే బ్లాగ్.."తుస్సు టపాయే"..
అ: అన్నాయి ...అంత కోపమెందుకు..దారి చూపు..
నే: గూగుల్ ఇమేజ్ లో దొరికే ఫొటోస్ అన్ని దాదాపుగా కాపీ-రైట్ హక్కులు వర్తిస్తాయీ.నీకో ఇమేజ్ నచ్చితే ..యా వేబిస్తే కాని ఆ బ్లాగర్ అడ్రస్ కి మెయిల్ చేసి పర్మిషన్ అడగవచ్చు...
నే: ఒకవేళ పర్మిషన్  సదరు వెబ్సైటు వాళ్ళు గాని లేదా బ్లాగర్ ఇవ్వలేదు అంటే మనము ఆ ఇమేజ్ ని వాడుకోడానికి లేదు.
 అ: మరి వాళ్ళు ఏ సమాధానం ఇవ్వకపోతే?
నే: నువ్వు చేసిన మెయిల్ వాళ్ళు చూసుకోకపోయిన  లేదా తిరిగి సమాధానం ఇవ్వకపోయినా సర్వహక్కులు అప్పుడుకూడా వారికే  చెందుతాయి.
అ: మరి అలాంటప్పుడు ఏమి చేయాలి?
నే: పర్మిషన్ కొన్నిసార్లు ఇవ్వవచ్చు.....కొన్ని సార్లు ఆ ఫోటో కి రుసుము అడగవచ్చు..
అ: అన్నాయి...అసలే ఆర్ధిక మాంద్యం డాలర్లు సమర్పించుకోలేను..ఫ్రీ గా ఏమి లేదా హే "అన్నిభగావాన్"
నే: ఉన్నాయ్ ఎందుకు లేవు
అ: మరి ...ఎక్కడ..
నే: ఆగుము.."చిన్నిభగావాన్".ఇదిగో అనిల్ బాబా ..గైకొనుము కొన్ని ఉచిత ఫోటో వెబ్సైట్స్
నాకు ఇష్టమైన రెండు సైట్స్
sxc.hu 
ఇంకో రెండు ఫ్రీ లింక్స్ నీకు ఉచితంగా 
ఫ్రీ ఫోటో
అ: థాంక్స్ "అన్నిభగావాన్"
నే: పెద్ద వారి మాట సద్దన్న మూట అన్నారు.వెబ్సైటు పేరులో ఫ్రీ ఉందని ఫ్రీ ఫ్రీ అనుకోకు ..కాపీ-రైట్ హకులు చదివి ఫోటో డౌన్లోడ్ చేసుకో సరేనా
అ: వాకే
~~~~@@@@~~~

మంగళవారం-లంకెలు

దేశ విదేశాల్లో కాపీ రైట్ హక్కులు గురించి సవివరంగా ఇక్కడ

కాపీ రైట్ హక్కులు

వంద గూగులమ్మ ట్రిక్కులు

గూగుల్ ట్రిక్స్

~@@@@@~

బొమ్మకు కోపం వస్తే..

పెయంట్ ప్రోగ్రాం లో మీరు గీస్తున్న బొమ్మకు కోపం వస్తే

ఎందు కొస్తుంది అంది కోపం.మీరు మరీనూ

హ హ వస్తే

అవును వస్తే ?ఎలా ఉంటుంది..

ఇలా ఉంటుంది చూడండి..

http://tinyurl.com/37s6xo

పే చక్ చా...." ఓ బ్లాగ్ కథ "

నే: ఓ బ్లాగ్ మొదలెట్టుతున్న
ముదురు దోశ:ఎట్టేసుకో...ఎవడైనా అడ్డొస్తే .దోశ తోడు అడ్డంగా నరుకుతా..
నే: చిన్న దానికే నరుకుడు వరకు వద్దులే ...దోశా.. బ్లాగ్ కి పేరు పెట్టాలి ...నువ్వు సినిమా వాళ్ళతో పని చేస్తావు గా ఓ పేరు చెపొచ్చుగా 
ముదో: ఖేఖ దుబా
నే: అదేంటి పేరు రా?
ముదో:  ..ఖేల్ ఖతం దుఖ్నం బంద్...
నే: జోకులా..?
ముదొ: పేరా?? ..గింత సడన్గా అడిగితే ఏం చెప్పాలే?
నే: ఏదో ఒకటి చెప్పు...
ముదొ: అయితే ఓ నిమిషం ఆగు
నే: ఎందుకు ?
ముదొ: మా దోస్తు ఒకాయన ఉన్నాడు..ఆయన్ని అడిగి చెబుతా
నే: ఎవరు ఆయన?
ముదొ: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈయన సినిమా టైటిల్స్ అదుర్స్...ఎవరి పేరు చెబితే
సమస్త ప్రంపంచం లోని వెదవలు పళ్ళు ఇకిలిస్తారో ఆయనే ...."వడా వైకుంఠం"
కాల్ చేసి కాన్ఫరెన్స్ లో పెట్టుతా..విను ఏం పేర్లు చెబుతాడో..
ముదొ: హలో ..వడా నువ్వేనా
వవై: ఆ నేనే ..ఒలాలు అటువైపు..
ముదొ: నేను రా.
వవై: చెప్పరా ..@#$%^&&&&
ముదొ: ఏంటిరా అల తిట్టేసావు ..
వవై: నిన్ను కాదురా బాబు ..అది నా కొత్త సినిమా టైటిల్ ..నీ రీయాక్షన్ ఎలా ఉంటుందో చూసా ..
ముదొ: నీ టైటిల్స్ ..ప్రేక్షకుని మీద ప్రయోగించు కాని నా మీద కాదు
వవై: ఆ..ఎక్జాక్ట్లీ నాకు కావాల్సిన రీయాక్షన్ వచ్చింది నేను మళ్ళీ కాల్ చేస్తా ..ఉంటా
కట్ కట్ .....
నే: అన్నా ఆయనేం చెప్పలేదు గాని నువ్వే చెప్పు..
ముదొ: ఒరేయ్ మీ ఇంట్లో వాళ్ళని అడుగు ..జెమిని లో "కోనసీమ కొబ్బరికాయ" తో "కొత్త కోడలు" సీరియల్ లో ఈ రోజు ఓ నారీ "విలనోమణి "తన భర్తా తలకాయను ఎలా పుచ్చలు చేస్తోందో చూపెట్టుతారు.....మిస్ అయ్యామో ..ఆ సీరియల్ చివరిన వచ్చే SMS కాంటెస్ట్ లో అడిగే  ప్రశ్న
"ఆవిడ కొబ్బరికాయ తో తలకాయని ఎన్ని పుచ్చలు చేసింది"అన్న క్లిష్టమైన ప్రశ్న కి సమాధానం
చెప్పడం కష్టం అవుతుందిరా ..అయ్యో మాటల్లో పడి సీరియల్ స్టార్ట్ అయ్యింది అన్నదే మర్చిపోయా..బై
....................................................................................................................................
ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే మా చెల్లి కనిపించింది..
నే: ఓ చిన్నారి ..బ్లాగరి ఈ అన్నయ్యకు సహాయము చేయగలవా?
చె: య్య యా యా ...
పరిగేట్టేది గుర్రం యా యా యా ...తన్నులు తినేది గాడిదా ..యా యా యా
నే: వామ్మో ....
(ఇంతలో ఆకాశవాణి..నాయన ఇది ఏ వింత రోగము కాదు .మీ చెల్లలం గారు ఆకాశవాణి ఎఫ్ యం మిరుపకాయ వారు వేసే  "వడా వైకుంఠం" చిత్ర రాజసం "మరీ ముదురు" పాటలు వింటోంది అంటూ టంగున మ్రోగింది)
మొబైల్ లో పాటలు వింటోన్నచెల్లిని డిష్టర్బ్ చేస్తే ..ఆ తన్నులు ఈ అన్నయ గాడిదికి తగుల్తాయో ఏమో అని భయం వేసి -డోకోమో వారి "shtr is  sweeter " గుర్తొచ్చి.."అన్నకో లుక్ " అని టైపు చేసి పంపించా..ఆ మెసేజ్ డోకోమో వాడి టవర్ కి వెళ్లి మా చెల్లి ఫోన్ లో పడే సరికి కూని రాగాలు "గుండు కొట్టించి సున్నం ఎట్టి గాడిద మీద ఉరేగిస్తా" పాటకు చేరింది.ఏమో అనుకున్నాను గాడిద కు బ్రహ్మ రథం పడుతున్నారు..గాడిదలు కూడా పాడుకోవచ్చు ఇక ముందు -ఉంది లే మంచి కాలం ముందు ముందునా అని.
సందేశం చూసి చెల్లి ...ఓ లుక్ ఇచ్చి... దగ్గరికివచ్చి ..ఏంటి అంది?
నే: గాడిద కి పేరు పెట్టాలి అన్నాను..
చె: గాదిదకా ...?
నే: చ ...అయ్యో..ఏదో లోకం లో ఉండి అన్నాను గాని నా టెక్ బ్లాగ్ కి ఓ పేరు చూడరా అన్నాను..
చె: టెక్ అని పెట్టేసేయ్యి....బాగుందా ?
నే: బ్లాగ్ కి పేరు పెట్టాలి రా ...పొదుపుగా SMS పొట్టి పేర్లు కాదు..వినడానికి డిఫరెంట్ గా ఉండాలి
చె: టెక్ ముదురు ..లేదా టేకోకిరి...ఎలా ఉన్నాయ్ ..?
నే: బొందల ఉన్నాయ్ ...
చె: టెక్ అనినివేష్ అని పెట్టు ..బాగుంది రా ..ఎక్కడ పట్టావు?
"నువ్వే కావాలి" లోంచి అరువు తెచ్చా..
నే: వద్దులే
నే: టెక్ టాక్ .....టెక్ పార్క్ అనుకున్నాను ..
చె: బోర్ అన్నయ్య ...ఎన్ని వందల బ్లాగ్లు ఉన్నాయో ఆ పేర్ల తో ..
నే: తెలుగు లో లేవు కదరా?
చె: వద్దులే అన్నయ్య...ఇంకేం పేర్లు ఆలోచించావు
నే: ఒక పేరు ఉందిరా ....చెబితే నవ్వనని ఒట్టెట్టు..
చె: నవ్వనుగాని చెప్పు
నే: పేచ కుఛ ..ఇంగ్లిపీస్ లో Pecha kucha అని రాస్తారు.పే చక్ చ అని పలకాలి ...
చె: ఎక్కడ పట్టావు అన్నయ్య ఈ గమ్మతైన పేరు?
నే: ఓ మీట్-అప్ బృందం ఉంది జపాన్ లో.ఈ సమావేశాల గురించి ఇక్కడ వారి వెబ్సైటు లో చూడవచ్చు
చె: ఓ అలానా ..నాకు నిద్రా దేవాతా ఆవహిస్తోంది ...పెట్టేసేయి ..నాకు నచ్చలేదు కాని... ఏదో ఒక పేరు అన్నయ్యా..బ్లాగ్ పేరులో ఏముంది... పీచు కీచు  బ్లాగో కుచ్ కుచ్ బ్లాగో ఏదో ఒకటి ..రాసే టపా లో ఉండాలి గాని సరుకు...
ఇంకేం ఆలోచించలేదు ఆ రాత్రి ..
ఇదిగో అలా ఈ బ్లాగ్ పేరు ఖరారు చేశా
పే చక్ చా అని .......
www.peychakcha.blogspot

మంట నక్కకి 5 సంవత్సారాలోచ్..

మంట నక్క ప్రస్తానం....

November 2004 - మంట నక్క ఒకటి విడుదల 
October 2005 - 10 లక్షల డౌన్లోడ్ ఒక సంవత్సర కాలం లో 
October 2006 - మంట నక్క రెండో ఏడు 
June 2008 - ప్రపంచ రికార్డు సృష్టించిన డౌన్లోడ్ ల పర్వం. 
July 2009 - 1,000,000,000,000 డౌన్లోడ్



నా సిస్టం గురించి నాకు తెలీదు..ఎలా?

నైన్…సున్నాసున్నా సున్నా సున్నా ఒకటి…..
నే: ఎవరైఉంటారబ్బా?
హలో ….
రత్నాకర్ ని రా మామ…
నే: సలాం వాలేకుం రత్తి మియా….
ర: హౌలే …హిందీ ఏంటి రా ..తెలుగువారం తెలుగు లోనే మాట్లాడుదాము
నే: ఏదో మీ ఓల్డ్ సిటీ ల గిట్లేనే మాట్లాడుకుంటారు అనుకుని గట్ల నమస్కారం జేసిన.శానా రోజులకు…పురాగ నల్లపూసైనావు.
    వీడియో శూటింగ్స్ అయిపోయాయా..పెళ్ళెప్పుడు మామ..చంపపేట్ లో ఏ గార్డెన్ కి రావాలి…
ర: ఆగరా అయ్యా…తొందరెందుకు…
నే: విషయం చెప్పు
ర: ఎం లేదురా మొన్న లాప్టాప్ కొన్న డెల్ కంపెనీ..బాగుంటుందా..
నే: బాగుంటుందా?? కొన్నాక డౌట్ ఎందుకురా వారి  ..ఇంతకీ కాంఫిగారషన్ చెప్పరా…
ర: ౩౦౦….
నే: అబ్బో ఎం సినిమా రా అది ..సూపర్ సినిమా రా …పెర్షియన్ రాజు xerxes ని బలే  చూపిస్తారు రా ..హాలీవుడ్ డిరెక్టర్లు ఆ మజాకా.
   బాలీవుడ్ సినిమా రేంజ్ సినిమారా అది ..చరిత్ర ని ౩౦౦ ముక్కలు చేసి హాలీవుడ్ జిగురు తో అతికించేసి మహా గొప్ప సినిమా అని డబ్బా కొట్టారు రా …
ర: వోర్నాయనో …ఎక్కడనుంచి ఎక్కడికో వెళ్ళవు రా ..మీ గచిబౌళి నుంచి మా మిదానికి కి వెళ్లినట్టు.విష్యం మొత్తం విను  ముందర…తరువాత
   …౩౦౦ gb లాప్టాప్ రా…మిగితావి నాకు తెలీదూ.నీకు బాగ తెలుసు కదా..నీకో ఫ్రీ సర్జరీ చేసిపెట్టుతా గాని ..
    ఎవరైనా అడిగితే చెప్పలేకపోతున్నాను రా కంప్యూటర్ డీటైల్స్.నువ్వేమన్నా హెల్ప్ చేస్తావేమో అని ఫోన్ చేశా ..
నే: సరే గాని అదేదో ఫ్రీ సర్జరీ అన్నావుగా..ఈ మద్య ఒంట్లో కొవ్వు బాగా చేరిపోయింది నువ్వేమైనా ఫ్రీ గా చేక్కేసేయగలవా???
ర: రోజు ఎక్సెర్ సైజులు చేయర అదే తగ్గుతుంది..
నే: తోక్కులోది దీనికి నీ ఉచిత సలహా ఎందుకు .."టాక్ అండ్ వాక్" అని కోటి రూపాయల సలహా ఇచ్చాడులే మా అభిషేకు..
ర: అన్న నిన్ను గెలవలేము గాని ..కంప్యూటర్ గురించి ఎలా తెల్సుకోవాలి రా …
నే: ముందర స్తేతేస్స్కోపు తీసుకుని …
ర: మళ్లీ జోకులా…
నే: సరే ఈ సారి సీరియస్ గా ….
మై కంప్యూటర్ ఐకాన్  మీద రైట్ క్లిక్ చేస్తే నీ సిస్టం గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ వస్తుంది


My Computer>Rt click>Properties

వచ్చాయా డీటైల్స్ ?
వచ్చిన ఇన్ఫర్మేషన్ లో
విండోస్ ఎడిసన్ అంటే XP ఆ లేకా విస్టా నా లేకా విండోస్-7 + సర్వీసు ప్యాక్
మెమరీ లేదా RAM-కంప్యూటర్ లోని చిన్న మెదడు
ప్రాసస్సర్ -కంపెనీ (ఇంటెల్ ఆ లేకా AMD)-కంప్యూటర్ లోని పెద్ద మెదడు.. ఇవి ముఖ్యం

ర: ఇంత ఈజీ ఆ ..
నె: అవును అంతే ఈజీ ..
నే: ఇప్పుడు ఇంకో టిప్ …
ఈ లింక్ క్లిక్ చెయ్యి

CPU-Z
cpu-z

ఇక్కడ ఉచితంగా లబించే సాఫ్ట్వేర్ CPU-Z ని డౌన్లోడ్ చేసుకో..ఇంస్టాల్ (జిప్ ఫైల్ అయితే ఇంస్టాల్ లేకుండానే పనిచేస్తుంది).
లేదా ఇదిగో WINAUDIT అన్న ఇంకో సాఫ్ట్వేర్ కూడా Cpu-z లానే పనిఒచేస్తోంది.ఇంష్టలేషన్ చేసుకోనక్కర లేదు.

WINAUDIT

winaudit-2
ర: థాంక్స్ అన్న..
నే: థాంక్స్ వద్దు రా …. మా బ్లాగ్ లోకం లో నెనర్లు అంటారు దాన్ని..
ర: దేన్నీ
నే: థాంక్స్ ని
నెనర్లు ..నెనర్లు …ఉంటా మరి …

కొత్త సిస్టం..కొత్త సాఫ్ట్వేర్ల కథ


డాక్టర్ సాబ్ ఎక్కడ?
నేను: చెప్పు కేశవ..
కే: మావోడు అమెరికా నుంచి లాప్టాప్ పంపిండు
నే: ఇంకేంది మరి ..సెమినార్లు లో ప్రజంటేషన్ల  గోడవ పోయింది
కే: అంత మంచిగనే ఉంది గాని ..కొత్త సాఫ్ట్వేర్ లు లోడ్ చేసుకోవాలి ..నువ్వు వస్తే పని తొందరగా అయిపోతుంది..
MS Office 2007 ఉంది కాని మిగితా సాఫ్ట్వేర్ లు లేవు..
నే: గాదానికి గంత దూరం రావన్న…మరి నాకేంటి…
కే: లాప్టాప్ తో  పాటు ఇంగ్లీష్ Alfred Hitchcock ఒరిజినల్ DVD లు ఉన్నాయ్.నీకు అవి కావాలంటే రా..
నే: ఉమ్..
కే: ఎం సోచుతున్నావ్ …
నే: ఎం లేదు పని ఎక్కువుంది..నేను రాలేను గాని ఇంట్ల నెట్ ఉందా?
కే: నీకు తెల్వదా ..
నే: అయితే ఓ పని చేయి ..ఓ లింక్ పంపిస్తా ..
కే: పంపిస్తే ..
నే: జరా చెప్పనీ రాదే..ఇష్టోరీ మొత్తం ఇను
నే: గా లింక్ ని  క్లిక్ క్లిక్ చేసి వెబ్సైటు కి వెళ్ళు .ఈ వెబ్సైటు లో మనం రోజువారి కంప్యూటర్ పనులకు ఉపయోగా పడే సాఫ్ట్వేర్ లో పద్ధతి ప్రకారం అమర్చబడి ఉంటాయి..కావాల్సిన సాఫ్ట్వేర్ ఎదురుగా చెక్ బాక్స్ లో టిక్ చేసుకుని అన్ని ఒకేసారి డౌన్లోడ్ చేసుకోవచ్చు…

http://ninite.com/





కే: అందులో ఏవి (సాఫ్ట్వేర్) అవసరమో ఎలా తెల్సుకోవాలి
నే: ఒక నిమిషం ..పెన్ పేపర్ తెచ్చుకో..లిస్టు చెబుతా
మొదటి లిస్టు ..బ్రౌజర్లు..అంతర్జాల సమాచారాన్ని వీక్షించడానికి
ఈ లిస్టు లో ఉన్నవాట్లో నేనయితే ఫైరుఫాక్సు కి టిక్ కొట్టుతా .రెండో స్థానం.ఒపేరా/క్రోం..

మెస్సేజింగ్ కోసం
పిడ్గిన్ లేదా దిగ్స్బి(Pidgin/Digsby)-ఇందులో ఏదైనా ఒకటి ఇంష్టాల్ చేసుకుంటే..యాహూ మెసెంజర్,జీ టాక్,గాడు గాడు ,ఐ సీక్ యు ,ఇంకెన్నో మెసెంజర్ లు లోడ్ చేసుకున్నట్టే ..
మీడియా లో
పాటలు వినడానికి WINAMP బదులు AIMP 
వీడియోలు చూడడానికి VLC  లేదా KM ప్లేయర్
పాటలు కత్తరించి రింగ్ టోన్ లు తయారు చేసుకోడానికి AUDACITY


ఇమేజింగ్ లో
తాతల నాటి నుండి వస్తున్న MS Paint ప్రోగ్రాం కి బదులుగా కంప్యూటర్ లో భారి స్థలం ఆక్రమించని బుల్లి కతర్నాక్ పెయంట్ ప్రోగ్రాం

PAINT.NET
పికాసా-కెమెరా లో క్లిక్ మనిపించిన అందమయిన ఫోటో లను సిస్టం లో వెతికి ఓ క్రమ పద్ధతి లో పెట్టుకోవడం కోసం
డాకుమెంట్స్ లో
ADOBE REDER బదులు FOXIT
ఆంటీవైరస్ లో AVG
రన్ టైమ్స్ లో అన్ని ..
ఫైల్ షేరింగ్ లో UTORERNT

ఉటిలిటీస్ లో 
IMGBURN లేదా CDBURNERXP -నీరో కి బదులుగా
కంప్రేశంస్ లో 7-ZIP 
డెవలపర్  టూల్స్ లో NOTEPAD++
హా కేశవా…రాసుకున్నావా …ఇవి చాలు ఇప్పటికి ముందు ఆ సైట్ పట్టు సాఫ్ట్వేర్లు  డౌన్లోడ్ కొట్టు ..
ఇంకేమైనా ఉంటె నా హెల్ప్ లైన్ కి మెసేజ్ పెట్టు..
కే: షుక్రియా పెద్దన్న..
నే: అన్నగంత పెద్ద మాటలెందుకుగాని ..గా "హిచ్ కాక్"  ని పార్సల్ చెయ్యరాదే…ఉంటమరి …

“టై”..ఓ మంచి టైం పాస్ కథ..హాం ఫట్

ట్రింగ్ ట్రింగ్ ..ముక్కలా ముకాబుల లైలా …
ఆ ఆఆ  ఆయా
ఎక్కడుంది ఈ మొబైల్ ,కనిపించి చావదే
….ఓ లైలా ఓ లైలా ….
ఒరేయ్ ముజ్ను ఏదిరా ఎక్కడరా ఫోన్ -ఈ ఫోన్ రింగ్ టోన్ మార్చింది ఎవడురా (మా జుజుల్ గాడు ఆఫీసు లో ఫోన్ తో అడుకున్నట్టు గుర్తు…రేపు వాడి పని పట్టాలి)
ఈ చీకటిలో ఎక్కదాకున్నావే లైలా …
హమయ్య మొత్తానికి పారిపోయి మెత్త క్రింద దాక్కున్నావా వగలాడి…..
ఎవడురా ఇంత రాత్రి ఫోన్ చేసింది అని చూస్తే “వాళ్ళ” అమెరికా నుంచి మా తమ్ముడు

నేను : ఎన్న తంబి ..మంచి నిద్ర చెడగొట్టావూ …అసలే జెమిని సీరియల్ ” పాయసం ” సీరియల్ లో రేపు ఏడుపుగొట్టు సుందరాంగి
టేబుల్ ఫ్యాన్ కి ఎలా ఉరేసుకుంటుంది…..???
అసలు ఇది సాధ్యమా ..??? (ఎవడికి తెలుసు బాబు …ఉండు రాత్రి నేరాలు ఘోరాలు చూసి చెబుతా) తరువాయి భాగం లో చూడండి….
అంటూ ఆపేసాడు సస్పెన్స్ లో పెట్టి…అసలు  టేబుల్ ఫాన్ కి ఎలా ఉరేసుకుంటుంది అని అలోచించి చించి అలా నిద్రపట్టేసింది..
కలలోనైనా ఏక్తా కపూర్ కనిపించకపోదా అడిగేద్దాం అనుకున్నా…..”ఏ-కతా” కపూర్ హాయ్ అనిందో లేదో ఇదిగో “లైలా” వినిపించింది

చెప్పరా ఏంటి విశేషాలు అన్నాను
తంబి : అన్నోయ్ …..
నేను : ఏంటి రా ..ఒక్క మొగాడు ఇలా ఏడవడం ఏంటి ……నో …నేను ఒప్పుకోనంతే అన్నాను..
తంబి : అన్నోయ్ ….రేపు ఇంటర్వ్యూ ఉంది అన్నాడు..ఆ
నేను : …మరి ఏంటి రా ..గూగ్లమ్మ లోంచి ….”హౌ టు బ్లాస్ట్ ది  ఇంటర్వ్యూ” అని టైపు చేసి జవాబుల చిట్టి పట్టుకెళ్లు అన్నాను…
తంబి ; అన్నోయ్ …..
నేను : ఒరేయ్ ఆ పిలుపు ఆపరా…నాన్నోయ్ పులి కథ గుర్తుకొస్తోంది..
తంబి : యా..ఆపేస్తాను.
(నేను : అబ్బో వీడికో ఇంగ్లీష్ “యా”-స బాగానే అబ్బింది అనుకున్నాను..)
తంబి : బ్రో…
నేను : మళ్లీ ఇదేం పిలుపురా ..
తంబి : అన్నయ్య ..బ్రో అంటే బ్రదర్..
నేను : సరేగాని చెప్పరా ఏంటి సమస్యా ?
తంబి : అన్నయ్య రేపు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ..టై కట్టుకుని వెళ్లి ఇంటర్వ్యూ ని టై కి కట్టేసుకుని వద్దాము అనుకుంటే ..
టై కట్టుకోవడం రాదూ అని గుర్తుకొచ్చి….ఏడుపొచ్చి నువ్వు గుర్తొచ్చి నీకు ఫోన్ చేశా
నేను : మీ మిగితా “ఒక్క అమెరికా మగాళ్ళు” ను కనుక్కోపోయావా?టై ని ఎలా కట్టుకోవాలో?
తంబి : ఆన్నయ్య…ఒకడే ఉన్నాడు రూం లో ..వాడు నిన్నే వచ్చాడు…ఎర్ర బస్సు బ్యాచీ… వాడునూ ..
నేను : ఒరేయ్ ఎర్ర బస్సు అంటే అంత చులకనా?..ఎర్ర బస్సు ఎర్ర బస్సు ఎన్ని ఎల్లో… ఎర్రన్ని బస్సు ఎన్ని ఎల్లో అంటూ నాలోని భారతీయుడు మేల్కున్నాడు..
తంబి : అన్నోయ్ చెంపలేసుకుంట..తప్పైంది..”ఈ రోజు ఎర్ర బస్సులే రేపటి అమెరికా ఎల్లో టాక్సీ క్యాబులు”..సరే గాని ఎలా ఇప్పుడు టై ప్రాబ్లం కి బై ఎలా చెప్పాలి….నువ్వే ఏదైనా చేయి అన్నాడు ..
నేను : హే…..కృష్ణా..
ఫోన్ లో చెప్పడం కష్టం చిన్న ..నువ్వు టై ని ఫోన్ కి కట్టేస్తావు రా బుజ్జి ..లాప్టాప్ ఆన్ చేయి నీకో లింక్ పంపిస్తాను అందులో చూడు నీ ప్రాబ్లం ఉష్ కాకి.
తంబి : త్వరగా ఆన్నయ్య ..సి…. ఐ.. హావ్ ……నో టైం అన్నాడు వాడు..
నేను : నీ ఇంగ్లీష్ తగిలేయ్య …నెట్ ఆన్ చేసి చాట్ లోకి రా రా…
ఇదిగో లింక్…..

http://www.2tieatie.com/
Tie
తంబి : ఓస్ ఇంతేనా …అన్నయ్యా…యా
రాగాలు ఆపి ..ఇంటర్వ్యూ బాగా చెయ్యి ..టై కాదు ముఖ్యం ..ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వరా  నా “ఏ-కథ” కపూర్ పిలుస్తోంది రా ..
నిద్రాదేవతా….నన్ను చేరుము..హాం ఫట్…..