ఎక్కడా ఈయన పేరు లేదు?బ్లాగ్ పేరులో ఏదైనా క్లూస్ ఉన్నాయా అని వెతికి చూసా, కాని హుహు ..దొరికి చావదే?
పోస్టులు రాసినది సెరా అని మాత్రం కనిపిస్తోంది.
హలో ఎవరు మీరు?
ఏమో ఈ బ్లాగరి ఎవరో ఇతనికి తెలియదు.నిత్య ప్రయాణికుడు అని చెప్పుకొచ్చాడు...కళ్ళల్లో కలలు ఎన్నో..వాటిని సాకారం చేసుకునే దిశగా సాగుతున్న ఇతని పయనం లో ,బ్లాగ్ వనం ఓ తాత్కాలిక మజిలీ అని అన్నాడు.
పేరు అడిగితే..సెరా అని చెప్పాడు..అంటే అని అడిగితే తన కలం లేదా బ్లాగు నామము అని జవాబు వచ్చినది.సెరా అన్నది సిరా అనే పదంలోంచి వచ్చినదేమో అని నా ప్రగాఢ అభిప్రాయం.
ఈ బ్లాగరికి బ్లాగడం లో ఓ మోస్తారు అనుభవం ఉంది.ఆంగ్లములో లో మిత్రుల కోసం బ్లాగీ బ్లాగీ ,తెలుగు లో కూడా బ్లాగుదామని మనసు పీకీ ..ఇటు వైపు రావడం జరిగింది.ఈ బ్లాగరి కంప్యూటర్ విషయ పరిజ్ఞానం ఓ మోస్తారు..1 /5 మార్కులు వేయొచ్చు.తనకు తెలిసిన అల్లా టప్పా సైట్స్ గురించి వాగాడం చూసి..మిత్రులు భరించలేక,బ్లాగర్ గా ప్రమోషన్ ఇచ్చేసి చేతులు దుల్పుకున్నారు.
కాలేజీ రోజుల్లో ఇతగాడు..తప్పు ఫీల్డ్ లోకి వచ్చాడు అని అనుకున్నారు...మైక్రోసాఫ్ట్ ,గూగుల్ వారిని ఓడించడం ఇష్టం లేక తనే తప్పుకున్నాడు అని కోతలు కూడా కోశాడని కాలేజీ రీకార్డుల్లో భద్రపరిచారు..
"ఇతనికి పొట్ట కోస్తే ప్రోగ్రామింగ్ ముక్క రాదు అని బ్లాగ్ మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను"
ఆ రోజుల్లో "అమ్మాయి అణుభాంబు" అన్న బ్రహ్మపధార్థము పై వీరి మిత్రులందరు శోధనాగ్రంథములు చదువుతుంటే ఈ మహాశయుడు "కంప్యూటర్ దాని మర్మములు" అనే గ్రంథాలని తినేసావాడని అక్కడే మగజైన్ దుకాణం లో ఎక్కువ సమయం గడిపేవాడు అని పాత హాజరు పట్టికలో చూడగా తెలిసింది
ఈయన గారికి ఏకలవ్య శిష్యులు ఉండేవారని..."కాలేజీ పిట్టకథలు" అనే మహా గ్రంథం లో 2012 పేజి లో సవివరంగా రాసి ఉంది.
ఈయనకో గర్ల్ ఫ్రెండ్ ఉందని ప్రాథమిక పరిశోధన లో తేలింది..తీర చూస్తే డెస్క్టాపు ని ఇతనో గర్ల్ ఫ్రెండ్ లాగా చూసుకునే వాడని అర్థం అయ్యింది..ఇప్పుడో మరొక కొత్త గర్ల్ ఫ్రెండ్ ని కూడా చూసుకుంటున్నాడు అని తెలియవచ్చింది.ఈ మధ్యే లాప్టాప్ కొన్నాడని చెత్త బుట్టిలో చింపేసిన రసీదు చెప్పిన కథ.మార్గదర్శిలో చేరి ఓ చిన్న లాప్-టాప్ కొన్నాడని మిత్రబృందం ఊహాగానాలు..
ఇతని ఇష్టా ఇష్టాలు
"అమ్మ ఆవకాయ అంజలి " అని అదేదో సినిమాలో చెప్పినట్టుగా సమాధానం వస్తుంది అని అనుకుంటున్నారా ..అయితే మీరు ఆవకాయ లో చెంచా వేసారు..అమ్మ ఇష్టమే...ఆవకాయ ఓకే ..అంజలి..ఇంతకి ఎవరు ఈవిడ? అని టైపు మన ఈ బ్లాగ్ మిత్రుడు.
తెలుగు సాహిత్యం ఇష్టం.ఇంట్లో ఉన్న ట్రంక్ పెట్టల్లో తెలుగు పుస్తకాలు ఎన్నో.ఈ బ్లాగరి విశాలాంధ్ర బుక్ స్టాల్లో సంచరిస్తాడని ఇప్పుడే మొన్న అందిన వార్త."తెలుగు పుస్తకం కొను-ఇంగ్లీష్ పుస్తకం అయితే అరువు తీసుకో" అన్న నానుడి ఈయనదే -అని మిత్రబృందం ఊవాచ.(చూడుము:కాలేజీ కథలు..అధ్యాయము 2012 :23 పుట)
తెలుగు జానపదాలు..ఆ పాత మధురాలు..కమ్మని కమనీయ హింది వివిధభారతి పాటలు...ఇంగ్లీష్ రాక్ సంగీత హోరు ....
తెలుగు కామెడీ సినిమాలు..రాజేంద్రుడువి(పాతవి అని మనవి చేసుకోమన్నాడు)..నవతరంగం లో సినిమా రివ్యూలు చదవడం ఈ మధ్యే అలవాటు చేసుకున్నాడు.అలాగే పంచావతరం అనే కామెడీ క్రిటిక్ సీరియల్ ని బాగానే ఆస్వాదిస్తారు అని మొన్న ఇతని ఇంట్లో పెట్టిన సీక్రెట్ కెమెరా కి క్లిప్పింగ్లు దొరికాయి.
ఈ జీవి విశాలాంధ్ర,ఆదివారం కోటి పాత పుస్తకాల షాపుల దగ్గర కనిపించనప్పుడు ఇరాని కేఫుల్లో ఇరాని చాయ్ తాగుతూ కనిపిస్తాడంట..
మరి నచ్చనివో
"నాకు తెలుగు లో నచ్చని ఒకే ఒక ..."అంటూ అనడం ఇప్పడివరకూ ఎప్పుడు అనలేదని సవినయంగా తెలియజేసుకుంటూ ..
విరామ సూచికను పెట్టేసి ....

1 comment:
() ముద్ర వేసితిమి :)
Post a Comment
ఓ అతిథి మహాశయా!
ఓ పరి ఆగుము..
అతిథి: ఆగి ఏమి చేయవలె?
బ్లాగరి: చిన్న విన్నపం
అతిథి: విన్నవించండి ..
బ్లాగరి: ఈ బ్లాగర్ కొన్ని టపాలకే టపాకట్టేయకుండా ఉండాలంటే..మీ సహాయము కావాలి..
అతిథి: ఏ తీరుగా?
బ్లాగరి: ఈ బ్లాగర్ అంతరించకుండా ఈ బ్లాగ్ లోని టపాలు బ్లాగ్ పురావస్తు శాఖలో దుమ్ము పట్టకుండా ఉండాలంటే ఈ బ్లాగ్ ని సందర్శిస్తే మీరు ఇటు వైపు వచ్చి వెళ్లినట్టు గుర్తుగా మీ కామెంట్ ముద్రలు వేసి వెళ్ళగలరు.