క్లిక్ క్లిక్

blogger hit counter

పే చక్ చా...." ఓ బ్లాగ్ కథ "

నే: ఓ బ్లాగ్ మొదలెట్టుతున్న
ముదురు దోశ:ఎట్టేసుకో...ఎవడైనా అడ్డొస్తే .దోశ తోడు అడ్డంగా నరుకుతా..
నే: చిన్న దానికే నరుకుడు వరకు వద్దులే ...దోశా.. బ్లాగ్ కి పేరు పెట్టాలి ...నువ్వు సినిమా వాళ్ళతో పని చేస్తావు గా ఓ పేరు చెపొచ్చుగా 
ముదో: ఖేఖ దుబా
నే: అదేంటి పేరు రా?
ముదో:  ..ఖేల్ ఖతం దుఖ్నం బంద్...
నే: జోకులా..?
ముదొ: పేరా?? ..గింత సడన్గా అడిగితే ఏం చెప్పాలే?
నే: ఏదో ఒకటి చెప్పు...
ముదొ: అయితే ఓ నిమిషం ఆగు
నే: ఎందుకు ?
ముదొ: మా దోస్తు ఒకాయన ఉన్నాడు..ఆయన్ని అడిగి చెబుతా
నే: ఎవరు ఆయన?
ముదొ: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఈయన సినిమా టైటిల్స్ అదుర్స్...ఎవరి పేరు చెబితే
సమస్త ప్రంపంచం లోని వెదవలు పళ్ళు ఇకిలిస్తారో ఆయనే ...."వడా వైకుంఠం"
కాల్ చేసి కాన్ఫరెన్స్ లో పెట్టుతా..విను ఏం పేర్లు చెబుతాడో..
ముదొ: హలో ..వడా నువ్వేనా
వవై: ఆ నేనే ..ఒలాలు అటువైపు..
ముదొ: నేను రా.
వవై: చెప్పరా ..@#$%^&&&&
ముదొ: ఏంటిరా అల తిట్టేసావు ..
వవై: నిన్ను కాదురా బాబు ..అది నా కొత్త సినిమా టైటిల్ ..నీ రీయాక్షన్ ఎలా ఉంటుందో చూసా ..
ముదొ: నీ టైటిల్స్ ..ప్రేక్షకుని మీద ప్రయోగించు కాని నా మీద కాదు
వవై: ఆ..ఎక్జాక్ట్లీ నాకు కావాల్సిన రీయాక్షన్ వచ్చింది నేను మళ్ళీ కాల్ చేస్తా ..ఉంటా
కట్ కట్ .....
నే: అన్నా ఆయనేం చెప్పలేదు గాని నువ్వే చెప్పు..
ముదొ: ఒరేయ్ మీ ఇంట్లో వాళ్ళని అడుగు ..జెమిని లో "కోనసీమ కొబ్బరికాయ" తో "కొత్త కోడలు" సీరియల్ లో ఈ రోజు ఓ నారీ "విలనోమణి "తన భర్తా తలకాయను ఎలా పుచ్చలు చేస్తోందో చూపెట్టుతారు.....మిస్ అయ్యామో ..ఆ సీరియల్ చివరిన వచ్చే SMS కాంటెస్ట్ లో అడిగే  ప్రశ్న
"ఆవిడ కొబ్బరికాయ తో తలకాయని ఎన్ని పుచ్చలు చేసింది"అన్న క్లిష్టమైన ప్రశ్న కి సమాధానం
చెప్పడం కష్టం అవుతుందిరా ..అయ్యో మాటల్లో పడి సీరియల్ స్టార్ట్ అయ్యింది అన్నదే మర్చిపోయా..బై
....................................................................................................................................
ఇప్పుడెలా అని ఆలోచిస్తుంటే మా చెల్లి కనిపించింది..
నే: ఓ చిన్నారి ..బ్లాగరి ఈ అన్నయ్యకు సహాయము చేయగలవా?
చె: య్య యా యా ...
పరిగేట్టేది గుర్రం యా యా యా ...తన్నులు తినేది గాడిదా ..యా యా యా
నే: వామ్మో ....
(ఇంతలో ఆకాశవాణి..నాయన ఇది ఏ వింత రోగము కాదు .మీ చెల్లలం గారు ఆకాశవాణి ఎఫ్ యం మిరుపకాయ వారు వేసే  "వడా వైకుంఠం" చిత్ర రాజసం "మరీ ముదురు" పాటలు వింటోంది అంటూ టంగున మ్రోగింది)
మొబైల్ లో పాటలు వింటోన్నచెల్లిని డిష్టర్బ్ చేస్తే ..ఆ తన్నులు ఈ అన్నయ గాడిదికి తగుల్తాయో ఏమో అని భయం వేసి -డోకోమో వారి "shtr is  sweeter " గుర్తొచ్చి.."అన్నకో లుక్ " అని టైపు చేసి పంపించా..ఆ మెసేజ్ డోకోమో వాడి టవర్ కి వెళ్లి మా చెల్లి ఫోన్ లో పడే సరికి కూని రాగాలు "గుండు కొట్టించి సున్నం ఎట్టి గాడిద మీద ఉరేగిస్తా" పాటకు చేరింది.ఏమో అనుకున్నాను గాడిద కు బ్రహ్మ రథం పడుతున్నారు..గాడిదలు కూడా పాడుకోవచ్చు ఇక ముందు -ఉంది లే మంచి కాలం ముందు ముందునా అని.
సందేశం చూసి చెల్లి ...ఓ లుక్ ఇచ్చి... దగ్గరికివచ్చి ..ఏంటి అంది?
నే: గాడిద కి పేరు పెట్టాలి అన్నాను..
చె: గాదిదకా ...?
నే: చ ...అయ్యో..ఏదో లోకం లో ఉండి అన్నాను గాని నా టెక్ బ్లాగ్ కి ఓ పేరు చూడరా అన్నాను..
చె: టెక్ అని పెట్టేసేయ్యి....బాగుందా ?
నే: బ్లాగ్ కి పేరు పెట్టాలి రా ...పొదుపుగా SMS పొట్టి పేర్లు కాదు..వినడానికి డిఫరెంట్ గా ఉండాలి
చె: టెక్ ముదురు ..లేదా టేకోకిరి...ఎలా ఉన్నాయ్ ..?
నే: బొందల ఉన్నాయ్ ...
చె: టెక్ అనినివేష్ అని పెట్టు ..బాగుంది రా ..ఎక్కడ పట్టావు?
"నువ్వే కావాలి" లోంచి అరువు తెచ్చా..
నే: వద్దులే
నే: టెక్ టాక్ .....టెక్ పార్క్ అనుకున్నాను ..
చె: బోర్ అన్నయ్య ...ఎన్ని వందల బ్లాగ్లు ఉన్నాయో ఆ పేర్ల తో ..
నే: తెలుగు లో లేవు కదరా?
చె: వద్దులే అన్నయ్య...ఇంకేం పేర్లు ఆలోచించావు
నే: ఒక పేరు ఉందిరా ....చెబితే నవ్వనని ఒట్టెట్టు..
చె: నవ్వనుగాని చెప్పు
నే: పేచ కుఛ ..ఇంగ్లిపీస్ లో Pecha kucha అని రాస్తారు.పే చక్ చ అని పలకాలి ...
చె: ఎక్కడ పట్టావు అన్నయ్య ఈ గమ్మతైన పేరు?
నే: ఓ మీట్-అప్ బృందం ఉంది జపాన్ లో.ఈ సమావేశాల గురించి ఇక్కడ వారి వెబ్సైటు లో చూడవచ్చు
చె: ఓ అలానా ..నాకు నిద్రా దేవాతా ఆవహిస్తోంది ...పెట్టేసేయి ..నాకు నచ్చలేదు కాని... ఏదో ఒక పేరు అన్నయ్యా..బ్లాగ్ పేరులో ఏముంది... పీచు కీచు  బ్లాగో కుచ్ కుచ్ బ్లాగో ఏదో ఒకటి ..రాసే టపా లో ఉండాలి గాని సరుకు...
ఇంకేం ఆలోచించలేదు ఆ రాత్రి ..
ఇదిగో అలా ఈ బ్లాగ్ పేరు ఖరారు చేశా
పే చక్ చా అని .......
www.peychakcha.blogspot

3 comments:

సెరా said...
This comment has been removed by the author.
Anonymous said...

Mee blog chaala chaala bagundhandi.Ilane continue cheyandi.

Anil said...

మీ బ్లాగ్ మంచిగ వుంది బై!!! జర గిట్నె ప్రొసీడ్ చేయి!!!

Post a Comment

ఓ అతిథి మహాశయా!
ఓ పరి ఆగుము..
అతిథి: ఆగి ఏమి చేయవలె?
బ్లాగరి: చిన్న విన్నపం
అతిథి: విన్నవించండి ..
బ్లాగరి: ఈ బ్లాగర్ కొన్ని టపాలకే టపాకట్టేయకుండా ఉండాలంటే..మీ సహాయము కావాలి..
అతిథి: ఏ తీరుగా?
బ్లాగరి: ఈ బ్లాగర్ అంతరించకుండా ఈ బ్లాగ్ లోని టపాలు బ్లాగ్ పురావస్తు శాఖలో దుమ్ము పట్టకుండా ఉండాలంటే ఈ బ్లాగ్ ని సందర్శిస్తే మీరు ఇటు వైపు వచ్చి వెళ్లినట్టు గుర్తుగా మీ కామెంట్ ముద్రలు వేసి వెళ్ళగలరు.