నే: హాయ్ అనిల్
అనిల్: ఎలా ఉన్నావు?
నే: నేను ఓకే ..ఇంకేంటి ..ఏదో బ్లాగ్ పెడతా అన్నావుగా..ఎక్కడి వరకు వచ్చాయి ప్రయత్నాలు ?
అ: ఏమి ప్రయత్నాలో ఏమో ..ఆది లోనే హంసపాదు అన్నట్టు ...
నే: ఎవయింది?
అ: మొదటి టపా రాసేసి ఓ ఇమేజ్ పెట్టా అందులో ..మొదటి కొన్ని హిట్స్ వచ్చాయి..దానితో పాటే కాపీ-రైట్ హక్కులు ఉల్లంగించినట్టు ఓ ఈమెయిలు ..నేను పట్టించుకోలేదు ..వర్డుప్రెస్సు బ్లాగ్ వాళ్ళకి వెళ్లినట్టు ఉంది రిపోర్ట్ ..వాడే మూసేసి ...నాయన ఇక నువ్వు బ్లాగినది చాలు అన్నాడు..అంతే..నేను మళ్లీ ఇంకో టపా రాయలేదు.మొదటి టపా కే బ్లాగ్ టపా కట్టేసింది...
నే: ఇంతకి ఇమేజ్ ఎక్కడనించి "కట్టి..కాపీ కొట్టి ..పేస్టినావు"
అ: గూగలోడి ఇమేజ్ సర్వీస్ నుండి..
నే: ఇంతకి ఏ ఫోటో?
అ: ఒక్క మొగాడి ఫోటో
నే: ఏ ఒక్క మొగాడిది?
అ: అమెరికా ఒక్క మొగాడిది
నే: ఓహో అందుకే ...అయ్యింది.ద్రోహి మన ఒక మగాళ్ళను మరచి పరాయి ఒక్క మొగాళ్ళ చిత్రం పెట్టితే బ్లాగ్.."తుస్సు టపాయే"..
అ: అన్నాయి ...అంత కోపమెందుకు..దారి చూపు..
నే: గూగుల్ ఇమేజ్ లో దొరికే ఫొటోస్ అన్ని దాదాపుగా కాపీ-రైట్ హక్కులు వర్తిస్తాయీ.నీకో ఇమేజ్ నచ్చితే ..యా వేబిస్తే కాని ఆ బ్లాగర్ అడ్రస్ కి మెయిల్ చేసి పర్మిషన్ అడగవచ్చు...
నే: ఒకవేళ పర్మిషన్ సదరు వెబ్సైటు వాళ్ళు గాని లేదా బ్లాగర్ ఇవ్వలేదు అంటే మనము ఆ ఇమేజ్ ని వాడుకోడానికి లేదు.
అ: మరి వాళ్ళు ఏ సమాధానం ఇవ్వకపోతే?
నే: నువ్వు చేసిన మెయిల్ వాళ్ళు చూసుకోకపోయిన లేదా తిరిగి సమాధానం ఇవ్వకపోయినా సర్వహక్కులు అప్పుడుకూడా వారికే చెందుతాయి.
అ: మరి అలాంటప్పుడు ఏమి చేయాలి?
నే: పర్మిషన్ కొన్నిసార్లు ఇవ్వవచ్చు.....కొన్ని సార్లు ఆ ఫోటో కి రుసుము అడగవచ్చు..
అ: అన్నాయి...అసలే ఆర్ధిక మాంద్యం డాలర్లు సమర్పించుకోలేను..ఫ్రీ గా ఏమి లేదా హే "అన్నిభగావాన్"
నే: ఉన్నాయ్ ఎందుకు లేవు
అ: మరి ...ఎక్కడ..
నే: ఆగుము.."చిన్నిభగావాన్".ఇదిగో అనిల్ బాబా ..గైకొనుము కొన్ని ఉచిత ఫోటో వెబ్సైట్స్
నాకు ఇష్టమైన రెండు సైట్స్
అ: థాంక్స్ "అన్నిభగావాన్"
నే: పెద్ద వారి మాట సద్దన్న మూట అన్నారు.వెబ్సైటు పేరులో ఫ్రీ ఉందని ఫ్రీ ఫ్రీ అనుకోకు ..కాపీ-రైట్ హకులు చదివి ఫోటో డౌన్లోడ్ చేసుకో సరేనా
అ: వాకే
~~~~@@@@~~~
1 comment:
nice.
మీ బ్లాగు టతిటిలు బావుంది
Post a Comment
ఓ అతిథి మహాశయా!
ఓ పరి ఆగుము..
అతిథి: ఆగి ఏమి చేయవలె?
బ్లాగరి: చిన్న విన్నపం
అతిథి: విన్నవించండి ..
బ్లాగరి: ఈ బ్లాగర్ కొన్ని టపాలకే టపాకట్టేయకుండా ఉండాలంటే..మీ సహాయము కావాలి..
అతిథి: ఏ తీరుగా?
బ్లాగరి: ఈ బ్లాగర్ అంతరించకుండా ఈ బ్లాగ్ లోని టపాలు బ్లాగ్ పురావస్తు శాఖలో దుమ్ము పట్టకుండా ఉండాలంటే ఈ బ్లాగ్ ని సందర్శిస్తే మీరు ఇటు వైపు వచ్చి వెళ్లినట్టు గుర్తుగా మీ కామెంట్ ముద్రలు వేసి వెళ్ళగలరు.