ట్రింగ్ ట్రింగ్ ..ముక్కలా ముకాబుల లైలా …
ఆ ఆఆ ఆయా
ఎక్కడుంది ఈ మొబైల్ ,కనిపించి చావదే
….ఓ లైలా ఓ లైలా ….
ఒరేయ్ ముజ్ను ఏదిరా ఎక్కడరా ఫోన్ -ఈ ఫోన్ రింగ్ టోన్ మార్చింది ఎవడురా (మా జుజుల్ గాడు ఆఫీసు లో ఫోన్ తో అడుకున్నట్టు గుర్తు…రేపు వాడి పని పట్టాలి)
ఈ చీకటిలో ఎక్కదాకున్నావే లైలా …
హమయ్య మొత్తానికి పారిపోయి మెత్త క్రింద దాక్కున్నావా వగలాడి…..
ఎవడురా ఇంత రాత్రి ఫోన్ చేసింది అని చూస్తే “వాళ్ళ” అమెరికా నుంచి మా తమ్ముడు
నేను : ఎన్న తంబి ..మంచి నిద్ర చెడగొట్టావూ …అసలే జెమిని సీరియల్ ” పాయసం ” సీరియల్ లో రేపు ఏడుపుగొట్టు సుందరాంగి టేబుల్ ఫ్యాన్ కి ఎలా ఉరేసుకుంటుంది…..???
అసలు ఇది సాధ్యమా ..??? (ఎవడికి తెలుసు బాబు …ఉండు రాత్రి నేరాలు ఘోరాలు చూసి చెబుతా) తరువాయి భాగం లో చూడండి….
అంటూ ఆపేసాడు సస్పెన్స్ లో పెట్టి…అసలు టేబుల్ ఫాన్ కి ఎలా ఉరేసుకుంటుంది అని అలోచించి చించి అలా నిద్రపట్టేసింది..
కలలోనైనా ఏక్తా కపూర్ కనిపించకపోదా అడిగేద్దాం అనుకున్నా…..”ఏ-కతా” కపూర్ హాయ్ అనిందో లేదో ఇదిగో “లైలా” వినిపించింది
చెప్పరా ఏంటి విశేషాలు అన్నాను
తంబి : అన్నోయ్ …..
నేను : ఏంటి రా ..ఒక్క మొగాడు ఇలా ఏడవడం ఏంటి ……నో …నేను ఒప్పుకోనంతే అన్నాను..
తంబి : అన్నోయ్ ….రేపు ఇంటర్వ్యూ ఉంది అన్నాడు..ఆ
నేను : …మరి ఏంటి రా ..గూగ్లమ్మ లోంచి ….”హౌ టు బ్లాస్ట్ ది ఇంటర్వ్యూ” అని టైపు చేసి జవాబుల చిట్టి పట్టుకెళ్లు అన్నాను…
తంబి ; అన్నోయ్ …..
నేను : ఒరేయ్ ఆ పిలుపు ఆపరా…నాన్నోయ్ పులి కథ గుర్తుకొస్తోంది..
తంబి : యా..ఆపేస్తాను.
(నేను : అబ్బో వీడికో ఇంగ్లీష్ “యా”-స బాగానే అబ్బింది అనుకున్నాను..)
తంబి : బ్రో…
నేను : మళ్లీ ఇదేం పిలుపురా ..
తంబి : అన్నయ్య ..బ్రో అంటే బ్రదర్..
నేను : సరేగాని చెప్పరా ఏంటి సమస్యా ?
తంబి : అన్నయ్య రేపు ఇంటర్వ్యూ కి వెళ్ళాలి ..టై కట్టుకుని వెళ్లి ఇంటర్వ్యూ ని టై కి కట్టేసుకుని వద్దాము అనుకుంటే ..
టై కట్టుకోవడం రాదూ అని గుర్తుకొచ్చి….ఏడుపొచ్చి నువ్వు గుర్తొచ్చి నీకు ఫోన్ చేశా
నేను : మీ మిగితా “ఒక్క అమెరికా మగాళ్ళు” ను కనుక్కోపోయావా?టై ని ఎలా కట్టుకోవాలో?
తంబి : ఆన్నయ్య…ఒకడే ఉన్నాడు రూం లో ..వాడు నిన్నే వచ్చాడు…ఎర్ర బస్సు బ్యాచీ… వాడునూ ..
నేను : ఒరేయ్ ఎర్ర బస్సు అంటే అంత చులకనా?..ఎర్ర బస్సు ఎర్ర బస్సు ఎన్ని ఎల్లో… ఎర్రన్ని బస్సు ఎన్ని ఎల్లో అంటూ నాలోని భారతీయుడు మేల్కున్నాడు..
తంబి : అన్నోయ్ చెంపలేసుకుంట..తప్పైంది..”ఈ రోజు ఎర్ర బస్సులే రేపటి అమెరికా ఎల్లో టాక్సీ క్యాబులు”..సరే గాని ఎలా ఇప్పుడు టై ప్రాబ్లం కి బై ఎలా చెప్పాలి….నువ్వే ఏదైనా చేయి అన్నాడు ..
నేను : హే…..కృష్ణా..
ఫోన్ లో చెప్పడం కష్టం చిన్న ..నువ్వు టై ని ఫోన్ కి కట్టేస్తావు రా బుజ్జి ..లాప్టాప్ ఆన్ చేయి నీకో లింక్ పంపిస్తాను అందులో చూడు నీ ప్రాబ్లం ఉష్ కాకి.
తంబి : త్వరగా ఆన్నయ్య ..సి…. ఐ.. హావ్ ……నో టైం అన్నాడు వాడు..
నేను : నీ ఇంగ్లీష్ తగిలేయ్య …నెట్ ఆన్ చేసి చాట్ లోకి రా రా…
ఇదిగో లింక్…..
http://www.2tieatie.com/
తంబి : ఓస్ ఇంతేనా …అన్నయ్యా…యా
రాగాలు ఆపి ..ఇంటర్వ్యూ బాగా చెయ్యి ..టై కాదు ముఖ్యం ..ఇంటర్వ్యూ కి ప్రిపేర్ అవ్వరా నా “ఏ-కథ” కపూర్ పిలుస్తోంది రా ..
నిద్రాదేవతా….నన్ను చేరుము..హాం ఫట్…..
1 comment:
Iragadeesaaru maastaaru.
hA HA HA FUNNY and Intresting post.
Post a Comment
ఓ అతిథి మహాశయా!
ఓ పరి ఆగుము..
అతిథి: ఆగి ఏమి చేయవలె?
బ్లాగరి: చిన్న విన్నపం
అతిథి: విన్నవించండి ..
బ్లాగరి: ఈ బ్లాగర్ కొన్ని టపాలకే టపాకట్టేయకుండా ఉండాలంటే..మీ సహాయము కావాలి..
అతిథి: ఏ తీరుగా?
బ్లాగరి: ఈ బ్లాగర్ అంతరించకుండా ఈ బ్లాగ్ లోని టపాలు బ్లాగ్ పురావస్తు శాఖలో దుమ్ము పట్టకుండా ఉండాలంటే ఈ బ్లాగ్ ని సందర్శిస్తే మీరు ఇటు వైపు వచ్చి వెళ్లినట్టు గుర్తుగా మీ కామెంట్ ముద్రలు వేసి వెళ్ళగలరు.